Monday, October 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం: మహేష్ కుమార్ గౌడ్

సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నామ‌ని టీపీసీసీ అధ్యక్షులు మ‌హేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని, అందుకు త‌మ ప్ర‌భుత్వం ఏ ఎలాంటి పోరాటానికైనా సిద్దంగా ఉంద‌ని ఆయ‌న దీమా వ్య‌క్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ తో ఒక జీవో జారీ చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింద‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు బిసి రిజర్వేషన్లు అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నార‌ని కొనియాడారు.8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామ‌ని,బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాల‌ని ఆయ‌న కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -