నవతెలంగాణ-హైదరాబాద్: తమ ఉద్యోగుల నియామకాల కోసం సుప్రీంకోర్టు రిజర్వేషన్లను ప్రతిపాదించింది. ఎస్‌సి, ఎస్‌టి తరగతులకు చెందిన సిబ్బంది ప్రత్యక్ష నియామకం, పదోన్నతులను కల్పించేందుకు సుప్రీంకోర్టు మొదటిసారి అధికారిక రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది. రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్స్, జూనియర్ కోర్టు అసిస్టెంట్స్ మరియు చాంబర్ అటెండెంట్స్ రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందనున్నారు.
ఈ నిర్ణయాన్ని జూన్ 24న సుప్రీంకోర్టు ఉద్యోగులందరికీ జారీ చేసిన సర్క్యులర్‌లో తెలియజేశారు. రోస్టర్ లేదా రిజిస్టర్‌లో తప్పులు లేదా సరికాని వాటి గురించి ఉద్యోగులు ఎవరైనా అభ్యంతరాలు/ప్రాతినిధ్యాలు లేవనెత్తినట్లయితే, వారు వాటి గురించి రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్)కి తెలియజేయవచ్చని సర్క్యులర్ పేర్కొంది. ప్రసుత్తం అమలులో ఉన్న సర్క్యులర్ /రోస్టర్ ప్రకారం, సుప్రీంకోర్టులో ఉద్యోగులు 15 శాతం రిజర్వేషన్లు, ఎస్‌టి ఉద్యోగులు పదోన్నతుల్లో 7.5శాతం రిజర్వేషన్ పొందనున్నారు.