– ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరగనుంది. ఈ మేరకు సీపీఐ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 23న సురవరం సుధాకర్‌రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఈ సంస్మరణ సభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీల నాయకులు, మేధావులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీపీఐ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఈ సభలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నేడు హైదరాబాద్‌లో సురవరం సంస్మరణ సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES