Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సురవరం సుధాకర్ రెడ్డి మరణం.. ఉద్యమాలకు తీరని లోటు

సురవరం సుధాకర్ రెడ్డి మరణం.. ఉద్యమాలకు తీరని లోటు

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటేరియన్‌ సురవరం సుధాకరరెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ జిల్లా వర్గ సభ్యులు గురుజ రామచంద్రం అన్నారు. సీపీఐ మునుగోడుసమితి ఆధ్వర్యంలో మునుగోడు  అంబేద్కర్ సెంటర్లో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఎస్‌ఎఫ్‌, వైఎఫ్‌ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు.

ఈ కార్యక్రమంలో సురవరం సుధాకరరెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌ గా కీర్తి గడించారన్నారు. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీపీఐ పార్టీ తరపున తెలియజేస్తున్నామన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను.ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగురి నరసింహ జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి గోస్కొండ లింగయ్య ఏం పండు దయాకర్ వనo. వెంకన్న  కట్కూరి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad