కృతజ్ఞతలు తెలిపిన అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు
నవతెలంగాణ – కాటారం ( మహాముత్తారం):
మహా ముత్తారం మండలం యామన్ పల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ కు శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపల్, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సలహా కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సూరపల్లి సుజాత సుమారు రూ.30 వేల విలువచేసే సహాయం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి యామన్పల్లి అంగన్వాడి బిల్డింగ్ నిర్మాణము పూర్తికాక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంపీపీఎస్ యామన్పల్లి పాఠశాల ఆవరణలోనే ఉండడంతో రెండు అంగన్వాడీల సెంటర్ల పిల్లలు పాఠశాలలో గల ఒక గదిని, వరండాను వాడుకుంటున్నారు.
ఈ క్రమంలో పాఠశాలలో పిల్లల సంఖ్య పెరగడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏ తిరుపతి స్పందించి ఈ పరిస్థితిని ప్రొఫెసర్ సుజాత అంగన్వాడి బిల్డింగ్ పరిస్థితి వివరించడంతో ఆమె వెంటనే స్పందించి ఆ బిల్డింగ్ లో ఒక రూముకు ఐదు కిటికీలు, రెండు తలుపులు, ఒక రూమ్, వరండాను ఫ్లోరింగ్ చేయించుటకు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది పాఠశాల అధ్యాపక బృందం, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తిరుపతి ప్రొఫెసర్ సుజాత అభినందనాలు తెలిపారు.



