Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం  

అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం  

- Advertisement -

హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు 
ఆ కోణంలో దర్యాప్తు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి శనివారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి అందాజ 10 గంటల నుండి ఉదయం 06 గంటల మధ్యలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వి.శ్రీనివాస్ కిరాణా దుకాణం ముందర ఒక గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. శవం ను పరిశీలించి చూడగా గుర్తు తెలియని వ్యక్తి ని గుర్తు తెలియని వ్యక్తులు అతని మెడ కు బట్ట, సుతిలి తో ఉరి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్టు పైకి కనపడుతోంది.

అతని మీద బ్లాక్ కలర్ ఫుల్ షర్ట్,  గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు .మృతుని వద్ద ముస్లిo టోపీ ఉన్నది.మృతుని వయసు సుమారు 50 నుండి 55 వరకు ఉంటది .మృతుడు భిక్షాటన చేసే వ్యక్తి గా పైకి కనపడుతుంది .అతని దగ్గర ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. ఈ ఘటనపై వెనిశెట్టి శ్రీనివాస్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ గుర్తు తెలియని వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసినవారు  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712659714 కు సమాచారం అందించాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad