Thursday, January 8, 2026
E-PAPER
Homeక్రైమ్యువతి అనుమానాస్పద మృతి

యువతి అనుమానాస్పద మృతి

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన యువతి
హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ సమీపంలోని హాస్టల్‌లో ఘటన
నవతెలంగాణ-అశ్వాపురం


హైదరాబాద్‌ మీర్‌పేట్‌ లోని ఓ ప్రయివేటు వసతి గృహంలో యువతి అనుమానాస్పద స్థితిలో ఆదివారం (ఈ నెల 4వ తేదీ) మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీర్‌ పేట్‌ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతురాలి స్వగ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రానికి చెందిన కనుకు సరస్వతి (21) ఏడాది నుంచి కంప్యూటర్‌ కోచింగ్‌ తీసుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లింది. ఈ క్రమంలో రెండు నెలల నుంచి ఓ ప్రయివేట్‌ కాల్‌ సెంటర్‌లోనూ పనిచేస్తుంది. కాగా, సరస్వతి ఆశ్వాపురం మండల కేంద్రంలో కిరాణా షాప్‌ నిర్వహించుకుంటున్న పాలడుగు పుల్లయ్య కుమారుడైన పాలడుగు నందకిషోర్‌ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆదివారం కూడా వారిద్దరు ఫోన్‌లో మాట్లాడు కున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా సదరు యువకుడు మాట్లాడిన మాటలకు మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకుని మృతి చెందిందని ఆరోపిస్తూ మంగళవారం మృతురాలి తల్లిదండ్రులతో పాటు బంధువులు మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సుమారు అరగంట పాటు ఆందోళన కొనసాగిం చారు. ఆందో ళనకారుల వద్దకు ఎస్‌ఐ రాజేష్‌ సిబ్బందితో వచ్చి నచ్చజెప్పి విరమింపచేశారు. అనంతరం మృతురాలి బంధువులతో పాటు కుటుంబీకులు యువకుని ఇంటిముందు టెంటు వేసి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగి స్తామని సుమారు నాలుగు గంటల పాటు భైటాయిం చారు. అయితే వారు ఆందోళన నిర్వహి స్తున్న సమయం లో యువకుని తల్లిదండ్రులతోపాటు ఇంట్లో ఎవరూ లేనప్పటికీ స్థానికంగా ఉన్న కొందరు పెద్ద మనుషులు, కొన్ని కుల సంఘాల నాయకులు మంతనాలు చేపట్టారు. అనంతరం పంచాయితీని ఓ కొలిక్కి తీసుకొని వచ్చి వారికి నచ్చే విధంగా హామీ ఇచ్చేలా ఏర్పాటు చేసి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఆందోళనను విరమిం చారు. మృతదే హాన్ని వారి స్వగృహమైన దుమ్ముగూడెం మండలంలోని నరసాపురం గ్రామానికి తీసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -