Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు 

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కొట్టాల గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ కల్లెట్ల లింగయ్య ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  విచ్చేసిన శ్రీ శంకరానంద స్వామి  ( శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం వ్యవస్థాపకులు – సంస్థాన్ నారాయణపురం )మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందనీ,యువత స్వామి వివేకానంద చెప్పిన విషయాలను ఆచరించి దేశోద్ధారన కై నడుం బిగించాలని కోరారు.సర్పంచ్ కలెట్ల లింగయ్య మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో తమ అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు  వ్యాసరచన,ఉపన్యాసం,నృత్యం,రంగోలి,చైర్ గేమ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య,మాజీ సర్పంచ్ గంట కృష్ణ,ఉపసర్పంచ్ జనగాం నరసమ్మ,వార్డు నెంబర్ కొలుగూరి ప్రవీణ్,ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్ ,నామాపురం సర్పంచ్ భీమనపల్లి రాములు,మేటి చందాపురం సర్పంచ్ పాదం రవి,ఉపసర్పంచ్ కుంభం వేణుగోపాల్ రెడ్డి, వివేకానంద యూత్ సభ్యులు,పాఠశాల ఉపాధ్యాయులు పురుషోత్తం,రాజు,రామకృష్ణ,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -