Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వస్తి వారి స్వశక్తి పరీవాల్ కార్యక్రమం

స్వస్తి వారి స్వశక్తి పరీవాల్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని యూపీఎస్సీ మాలపల్లి నందు డాక్టర్ రాణా ప్రతాగ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వస్తి వారి స్వశక్తి పరివాల్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మహిళలు ఆరోగ్యంగా ఉండే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది. అందరు ఆరోగ్యంగా ఉండాలి. ఈ కార్యక్రమం కొరకు ప్రత్యేక డాక్టర్ల బృందం డాక్టర్ శరత్చంద్ర, డాక్టర్ వైశాలి, డాక్టర్ అమర్దీపిక, డాక్టర్ ప్రియాంత్ , డాక్టర్ అక్షయ్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ రోహిణి, డాక్టర్ శశిధర్ మాలపల్లికి రావడం జరిగింది.ఈ క్యాంపు నందు ప్రజలకు ఉచిత సేవలు ఉచిత పరీక్షలు మందులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సూపర్వైజర్ శ్యామల మహమ్మద్ షాదుల్లా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -