Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ మహిళలకు తీపి కబురు..ఖాతాల్లోకి రూ.30 వేలు..!

తెలంగాణ మహిళలకు తీపి కబురు..ఖాతాల్లోకి రూ.30 వేలు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను వేగంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది ప్రభుత్వ ప్రధాన హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఉప పథకం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ( 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్) వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమై.. పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు కూాడా అందాయి. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రూ.2,500 అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను అధికారులు ముమ్మరంగా రూపొందిస్తున్నారు. 55 ఏళ్ల లోపు మహిళలను ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని, ప్రభుత్వ పింఛను (వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛను వంటివి) పొందని కుటుంబాల్లోని మహిళలకే ఈ సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకతను, సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని స్పష్టం చేస్తుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి త్వరలోనే మహిళలకు ఈ తీపి కబురు తెలియజేస్తారని పేర్కొన్నారు.. ఇది మహిళల్లో ఈ పథకంపై ఆశలను పెంచింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad