- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రేషన్ కార్డు దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 2 లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఇప్పటికే అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
- Advertisement -