నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ టూటౌన్ టౌన్ ఎస్ఐగా సయ్యద్ ముజాహిద్ ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రజలు పోలీస్ శాఖ నియమనిబంధనలను పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ నేరాలు నియంత్రణకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరు విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట, మట్కా ఆడుతున్న వారి సమాచారం, గంజాయి అమ్మిన , గంజాయి సేవించడం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇచ్చిన వారి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు బాధ్యతగా కృషి చేస్తానన్నారు.
టూటౌన్ ఎస్ఐగా సయ్యద్ ముజాహిద్
- Advertisement -
- Advertisement -