Monday, September 15, 2025
E-PAPER
Homeదర్వాజప్రతీకాత్మక కవిత్వం'నువ్వే ఒక సమూహం'

ప్రతీకాత్మక కవిత్వం’నువ్వే ఒక సమూహం’

- Advertisement -

‘కవిత్వం’ అనేది గొప్ప ఆలోచనలూ, అనుభూతులూ కలిసిన సమాహరం. మనసు పొరల్లో దాగి ఉన్న ఉద్వేగాలు, భావోద్వేగాలు, ఆవేదనలు, ఆలోచనలు ఉప్పొంగే కెరటంలా కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. నదుల్లా పారే మానసిక జీవన చిత్రాలను, నడిపించే చైతన్యాన్ని, ఉద్దీపనను ఆవిష్కరించేది కవిత్వమే. నిజ జీవిత పరిస్థితులను ఆధారంగా చేసుకొని, సమాజ హితాన్ని కోరుతూ, యువతలో ధైర్యం నింపే ఆత్మవిశ్వాసాన్ని వెలిగించేది కవిత్వం. అలాంటి సజనాత్మకత ఆధునిక కాలంలో ప్రతీకలతో, భావగాంబీర్యంతో, సమాజంలోని సమస్యలపై, అస్తిత్వ దక్కోణంలో రాసే కవులు కొందరే. ఆ కోవలోకి చెందే కవి, డాక్టర్‌ మహమ్మద్‌ హసేన్‌ గారు.

సమాజంలో ఉన్న పరిస్థితులను తన కలానికి బలంగా అద్దుతూ, దఢమైన కవిత్వాన్ని అల్లే కవి. మదుస్వభావి. నిత్యం ఏదో ఒక ఆలోచన అలజడిని అక్షరాలకు రంగులద్దుతూ ఉంటారు. కాలంతోపాటు నడుస్తూ, నిత్యం చైతన్యంతో సమస్యలపై ప్రశ్నించే వ్యక్తి. ఆయన రచించిన ”నువ్వే ఒక సమూహం” కవితా సంపుటి నిజానికి ఆత్మవిశ్వాసాల ప్రతీకల సమాహారం. ఈ కవితా సంపుటి ఒక భావజాల ప్రతీక. జీవన సౌందర్యం, మనోధైర్యం, మానవత్వం, ఆత్మవిశ్వాసంను రేకెత్తిచ్చే విధంగా ఉంది.
”ఆశా” అనే కవితలో…
”ఆశలో ఆత్మవిశ్వాసం ఉంటే
అందలం నీదవుతుంది చూడు”
అని యువతకు ప్రేరణాత్మక అక్షరాలను అల్లుతారు . ఆశను కేవలం భావనగానే కాక, ఆత్మవిశ్వాసానికి మూలమని పేర్కొంటారు. ఉత్సాహపరిచే పదజాలంతో ప్రేరణను కల్పిస్తూ ఉంటారు.
‘సంఘర్షణ’ కవితలో జీవన తత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది. వజ్రం ప్రకాశం చెందాలంటే రాపిడి అవసరం, సముద్రం ఉనికి కోసం అలలు తప్పనిసరి. అదే విధంగా జీవితం అనేది సంఘర్షణల సమాహారం, ఆటుపోటులు లేకుండా మనిషి ఎదగలేడు అని చెప్తారు.

వలస పక్షులు కవితలో
”మేము ఇప్పుడు గాజాలో గాలి దీపాలం
ఎప్పుడు ఆరిపోతామో తెలియదు
ఏ తూటా ఎటువైపు నుండి దూసుకొస్తుందో
ఏ మిస్సైల్‌ ఎవరి మీద పడుతుందో….” అంటూ
గాజాలో యుద్ధ భయాందోళనను చిత్రించారు. ప్రజలు ప్రతి క్షణం మరణ భయంతో జీవిస్తున్నారు. ఇక్కడ ఒక శాంతి సందేశం ఇస్తూ, యుద్ధాల వ్యర్థతను ఎత్తి చూపారు.
”నేనొక్కడినే ఒంటరినని దిగులు ఎందుకు ఎప్పుడూ?
అనంత శూన్యంలో అలుపెరగక పయనించే సూర్యుడు ఒక్కడే కదా
…………..
నువ్వు ఒంటరి వని ఎవరున్నారు ఇప్పుడు?
ఒక్కసారి నీ అంత సముద్రంలోకి
నీకై నువ్వు పారిచూడు”
ఈ కవితలో కవి ప్రేరణాత్మక సందేశం ఇస్తాడు. సూర్యుడు ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు, కానీ లక్షలాది ప్రాణుల జీవనానికి ఆధారం. అలాగే మనిషి కూడా ఒంటరిగా అనిపించినా, అతని వెనుక ఒక సమూహం ఉంటుంది. కాబట్టి నిరాశలో కాక, ధైర్యంగా ముందుకు సాగమని ఉత్తేజపరుస్తారు. మొత్తం కవితల ద్వారా కాల సత్యం, సంఘర్షణలు, మానవ విలువలు, తల్లిదండ్రుల ప్రేమ, యువత బాధ్యతలు, శాంతి, ప్రేరణ వంటి విభిన్న కోణాలను స్పష్టంగా ఆవిష్కరించారు. సులభమైనా,బలమైన పదజాలం, ప్రతీకలు, ఉపమానాలు డాక్టర్‌. మహాహ్మద్‌ హసేన గారి కవిత్వాన్ని పాఠక హదయాలకు హత్తుకునేలా చేస్తున్నాయి.

  • కంచర్ల మహేష్‌, 6300489220
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -