– ఓటర్ల ఇక్కట్లు
– పట్టించుకోని సంబంధించిన అధికారులు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల పోలింగ్ కేంద్రాల ఆవరణలో బురదమయంగా మారడంతో ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడితే ఎలా బురదమయంగా మారుతుందో అలా కావడంతో వృద్ధులు, మహిళలు జారిపడటమే కాకుండా కాళ్ళకు, చెప్పులకు బురద అంటడంతో పోలింగ్ కేంద్రాలంతా బురదగా మారిపోయింది.

పోలింగ్ నిర్వహించడానికి హాజరైన అధికారులు, సిబ్బంది కేంద్రాల ఆవరణలోనే మోటార్ తో స్నానం చేయడం ద్వారానే బురదమయంగా మారిందని పలువురు చెబుతున్నారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాల ప్రక్కన,లేదా వెనకాల చేస్తే ఈ బురద కాకుండా ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



