Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుబీడీ కార్మికుల శ్రమను దోచుకుంటున్న తాజ్ యాజమాన్యం

బీడీ కార్మికుల శ్రమను దోచుకుంటున్న తాజ్ యాజమాన్యం

- Advertisement -

ఎన్ని సార్లు చర్చలు జరిపినా పట్టించుకోవడం లేదు
తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – డిచ్ పల్లి 

తాజ్ యాజమాన్యం..గత మూ డేండ్లుగా బీడీ కార్మికులతో పనులు చేయించుకుంటూ.. ఇప్పటి వరకూ వారి పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీ ఎదుట తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూడేండ్లుగా పీఎఫ్ డబ్బులు జమ చేయకపోవడం తో పాటు.. 14 క్వింటాళ్ల ఆకు, కార్మికులకు చెల్లించాల్సిన బట్వాడాను ఇవ్వ లేదన్నారు. రెండేండ్లుగా ఆరోగ్యం సహకరించక పోవడంతో పలువురు రాజీనామా చేశారని, వారందరికీ సర్వీస్ డబ్బులు నేటి వరకు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఏడు నెలల క్రితం ఢిల్లీలో సిఐటీయూ జాతీయ నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా రెండు నెలల్లోనే కార్మికులకు చెల్లించవలసిన డబ్బులను అంద జేస్తామని చెప్పారని, కాని ఏడు నెలలు దాటినా సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 9న తాజ్ బీడీ కంపెనీ వద్ద బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు కంపెనీ యజమాన్యం మూడు నెలల గడువు కావాలని కోరారని, వారు కోరిన మూడు నెలల గడువు కూడా ముగిసి ఇంకా నెల ఎక్కువవుతున్న ఇప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని నూర్జహాన్ మండిపడ్డారు. 70మంది బీడీ కార్మికులకు సర్విస్ డబ్బులు 4 లక్షల 50వేలు,గత ముడేళ్ళుగా పిఎఫ్ డబ్బులు ఖాతా లో జామ కాలేదని, రేండు బట్వాడా లు చేల్లిచల్సిఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. మాణిక్ బండార్, పెద్ద బోర్గం కు చెందిన దాదాపు 100 మంది బీడీ కార్మికులకు చెల్లించవలసిన నాలుగున్నర లక్షల సర్వీస్ డబ్బులను ఈనెల 29న చెల్లిస్తానని తాజ్ బీడీ యజమాన్యం, మేనేజర్ భారత్ భాయ్ పటేల్ యజమాని తో ఫోన్లో మాట్లాడి రాతపూర్వకంగా రాసి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కు కార్మికులకు అందజేశారు.

ఈ హామీని నెరవేర్చకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులందరినీ ఏకం చేసి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్మికులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు లతా, లావణ్య, సారిక, మమత, మంజుల, సరళ, రజిత, లావణ్య, భాగ్య, సుస్మిత, పుష్ప, మానస, దివ్య, నవ్య, సంహిత, నవిత,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -