నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మండలంలోని తాజ్పూర్ గ్రామస్తులు శ్రీలింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీని గ్రామంలో ఎవరి ప్రమేయం లేకుండా దేవాదాయ శాఖ అధికారులు నూతన కమిటీని వేశారు. ఈ కమిటీని రద్దుచేయాలని బి ఆర్ఎస్ పార్టీ జిల్లా యువ నాయకులు డా. ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎవరికి తెలవకుండా ఎవరి ప్రమేయం లేకుండా కమిటీని వెయ్యడం చాలా దారుణమని అన్నారు.ఈ కమిటీని తక్షణమే రద్దుచేసి గ్రామంలోని అందరి అభిప్రాయం తీసుకొని నూతన కమిటీని వేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాగరాజు, గిరిబాబు మైసయ్య వెంకటేష్ గోవర్ధన్ కిరణ్ సందీప్, రామకృష్ణ, మధు,కృష్ణ, రాములు, నరసింహ రాజు, కొండల్, భాస్కర్, మహేష్, నరసింహ, రమేష్, బాలయ్య, పోచయ్య, శంకరయ్య యువకులు పాల్గొన్నారు.