నవతెలంగాణ-టేకుమట్ల
టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి (బి) గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో అన్న ప్రసన్న, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. బుధవారం వెంకట్రావుపల్లి (బి) గ్రామ సర్పంచ్ పెరుమండ్ల చంద్రకళ మొగిలి,అంగన్వాడి సూపర్వైజర్ సరోజన ఆధ్వర్యంలో కిషోర్ బాలికలకు అన్న ప్రసన్న, అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు పాలు, గ్రుడ్లు, కిశోర బాలికలకు ఇంద్రమ్మ అమృతం పంపిణీచేశారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ .. నన్ను ఆహ్వానించి అంగన్వాడి కేంద్రం అందించే పౌష్టికాహారాలను నా చేత పంపిణీ చేయించడం అభినందనీయమన్నారు. అంగన్వాడి సేవలు అద్భుతమని కొనియాడారు. అంగన్వాడి అందించే సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం అంగన్వాడి సిబ్బంది సర్పంచ్ చంద్రకళను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సరోజన, అంగన్వాడి టీచర్లు రజిత, రాజకుమారి, రేణుక, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.



