Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీసీ యాత్రదానం సద్వినియోగం చేసుకోండి

ఆర్టీసీ యాత్రదానం సద్వినియోగం చేసుకోండి

- Advertisement -

– ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 
నవతెలంగాణ -పరకాల : టిజియస్ ఆర్టీసీ సంస్థ అందిస్తున్న యాతదానం బస్సు సర్విసులను సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, డిపో మేనేజర్ రాంప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాల యంలో ఆర్టీసి సంస్థ ద్వారా ప్రారంభించిన యాత్రదానం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే రేవూరి ఆవిష్కరించారు. దేశంలో ఏ ఆర్టీసీ సంస్థ ఇలాంటి కారుక్రమం చేపట్టలేదని తెలంగాణా రాష్ట్రా రుడ్డు రవాణా సంస్థ ఆద్వర్యంలో యాత్రదానం కార్యక్రమాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే అన్నారు.

నిరాశ్రయాలు, వుద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను వివిధ కార్యక్రమాలైన దైవ దర్శనాలకు, విహారా యాత్రలకు, పండుగలకు, వైజ్ఞానిక యాత్రలకు, పున్యాక్షేత్రాలకు తీసుకు వెళ్ళడం ముఖ్య ఉద్దేశమన్నారు.

దాతల విరాళం ద్వారా ఆర్టీసీ యాతృదానం సౌకర్యం కల్పించి వచ్చిన విరాళంతో తెలంగానాతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని పుణ్యక్షేతాలకు, పర్యాటక ప్రాంతాలకు వైజ్ఞునిక యాత్రలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్టీఐ,సిఐ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -