అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్
నవతెలంగాణ – వనపర్తి
రబీ 2024-25 సీజన్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి ధాన్యం పొందిన బాయిల్డ్ రైస్ మిల్లర్లు సీఎంఆర్( కస్టమ్ మిల్లింగ్ రైస్) సమర్పించేందుకు పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ సూచించారు. శనివారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ రబీ 2024-25 సీజన్ కు సంబంధించి సీఎంఆర్( కస్టమ్ మిల్లింగ్ రైస్) సమర్పించేందుకు ప్రభుత్వం మూడు నెలలు గడువు పొడిగించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిల్లర్లు నిర్ణయిత గడువులోగా సీఎంఆర్ ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.
అదేవిధంగా రబీ 2024- 25 సీజన్ కు సంబంధించి జిల్లాలోని వివిధ గోడౌన్లలో ఉన్న 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించడం జరుగుతుందని, అందుకు సంబంధించిన సీఎంఆర్ కూడా నిర్నిత గడువులోగా మిల్లింగ్ చేసి అప్పగించాల్సి ఉంటుందని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డి ఎం జగన్ మోహన్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



