లక్ష్మీనారాయణపురం సర్పంచ్ ప్రదీప్
నవతెలంగాణ – పాలకుర్తి
ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మీనారాయణపురం సర్పంచ్ బొడిగే ప్రదీప్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని లక్ష్మినారాయణపురం గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశు సంవర్డక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని, గాలి కుంటు నివారణటీకాలు శిబిరాన్ని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రావు, జనగామ సహాయ సంచాలకులు డాక్టర్ దేవేందర్, మండల పశు వైద్యాధికారి దేవిరెడ్డి అశోక్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ప్రదీప్, జిల్లా పశు వద్యాధికారి మురళీధర్ రావు మాట్లాడుతూ పాడి రైతులు పశుగ్రాసాల పెంపకం,దూడల పెంపకం ,లింగ నిర్దారణ వీర్యం గురించి పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాడి గేదెలకు, పశువులకు, గొర్రెలకు, మేకలకు వచ్చే సీసనల్ వ్యాధులను అరికట్టేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య శిబిరం 79 పాడి పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్ష అశోక్, దేవరుప్పుల పశువైద్యాధికారి డాక్టర్ స్వర్ణశిల్ప, గోపాలమిత్ర సూపర్వైజర్ వై.రాజేశ్వర్ రావు గోపాలమిత్రలు బో రెడ్డి మధుమోహన్ , రాగిరి సమ్మయ్య. ఏనుగు వెంకటరెడ్డి లతోపాటు పశువైద్య సిబ్బంది, గ్రామస్తులు, పాడి రైతులు పాల్గొన్నారు.



