Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వంజరి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఆగస్టు 15న ప్రతిభా పురస్కారాలు

వంజరి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఆగస్టు 15న ప్రతిభా పురస్కారాలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రతి సంవత్సరం లాగే తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పైచదువుల విద్యార్థినిలు 80 శాతానికి పైగా మెరిట్ మార్కులు సాధించిన వారికి వంజరి సంఘం తరపున ప్రతిభా పురాస్కారాలు అందిస్తామని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. ఈ మేరకు కాలేరు నరేష్ , కొండల్(వెంకటేశం) ఆదేశాలనుసారం రాష్ట్ర సంఘ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఈ పురస్కారాలు అందిస్తామని సుభాష్ నగర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు మాస్టర్ శ్రీనివాసరావు, రాష్ట్ర సంఘము, నిజామాబాద్ జిల్లా టౌన్ ప్రతినిధులు నిర్వహించిన ప్రెస్ మీట్ ద్వారా నిజామాబాద్ విద్యార్థినిలకు తెలియజేశారు.

అయితే విద్యార్థులు 5వ ఆగస్టు , 2025 తేదీ లోపు తమ మార్కుల మెమో, బయోడేటాను సుభాష్ నగర్ కార్యాలయంలో అందించాలని తెలిపారు. వాటిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని వారు తెలిపారు. తదితర వివరాలకై సభ్యులకు ఫోన్ ద్వారా 9848490055, 98493 91493 లకు సంప్రదించగలరు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం నిజామాబాద్ ప్రతినిధులు అయినటువంటి రాష్ట్ర నాయకులు కాలేరు గడ్డం శ్రీనివాస్, గోపాల్ శ్రీనివాస్ (అయ్యప్ప), మాయవార్ సాయిరాం, పెట్టేరు రాజు రాష్ట్ర ట్రస్ట్ సభ్యుడు మాస్టర్ శంకర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -