Sunday, October 19, 2025
E-PAPER
Homeసోపతిటాలెంట్‌ స్ట్రాటజీ మారాలి, స్కిల్‌ మైగ్రేషన్‌ ఆగాలి

టాలెంట్‌ స్ట్రాటజీ మారాలి, స్కిల్‌ మైగ్రేషన్‌ ఆగాలి

- Advertisement -

నిన్నమొన్నటి దాకా ఉద్యోగాలున్నాయి బేగి వచ్చేసేయండని కేకేసి మరీ పిలిచిన అమెరికా ఇప్పుడు జాబ్‌ గిబ్‌ నైజాన్తానై. మీ సేవలేం అక్కర్లేదు మా దేశం ఖాళీచేయండని తరిమేస్తున్నప్పుడు గత్యంతరం ఏముంది? పెట్టేబేడా సర్దుకొని మాతదేశం రావడమే. విదేశీయులను పంపించడం కేవలం ఉపాధిని కొల్లగొడుతున్నారనో, డాలర్లు దాచేసుకుంటున్నారనో కాదు. ప్రపంచ పెద్దన్న అమెరికా ఒంట్లో మెదడులో ఇప్పుడు రేసిజం సిన్డ్రోమ్‌ పెరుగుతుంది. జెనోఫోబియా ముసురుకుంది. అయితే, అమెరికాను తన భయానికి తన కుటిలమతికి, జాత్యహంకారానికి, విద్వేష భావానికి తనకే వదిలేద్దాం. లేదన్న వాడిని భ్రమసి అడగరాదు కదా. కాదు కూడదన్న వాడి చెంత గతిచెడి బతిమాలి ఉండలేం, ఉండరాదు కూడా.

ఇప్పుడు ప్రవాస భారతీయులు ఏం చేయాలి? ఆ చేయడం ఎక్కడ నుండి దేని నుండి మొదలుపెట్టాలి అనేది మనదేశం ముందు, మన ప్రభుత్వాల ముందున్న ప్రశ్నలు. ఇందుకు ‘కెరీర్‌ అండ్‌ టాలెంట్‌ స్ట్రాటజీని మార్చుకోవాలనేదే అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల సలహా, సమాధానం. కెరీర్‌ అండ్‌ టాలెంట్‌ స్ట్రాటజీని మార్చుకోవాలంటే మొదట మన దష్టికోణం, ఆలోచనా విధానం మారాలి. ఇంత వరకు ఎంత మంది భారతీయ టెక్నోక్రాట్స్‌ విదేశాలలో స్థిరపడ్డారు? ఎంత మంది ప్రపంచ జజుఉలు భారత సంతతికి చెందినవారు అనేది మన ప్రతిష్ఠకు కొలమానంగా ఉంది. ఇది పూర్తిగా విలోమం కావాలి. ఎంత మంది స్కిల్డ్‌ వర్క్‌ ఫోర్స్‌ ఇండియాలోనే ఉండాలనుకుంటున్నారు, ఎంతమంది అమెరికా నుండి తిరిగి మాతదేశం వస్తారనేది ఇప్పుడు సక్సెస్‌కు, గౌరవానికి మార్గదర్శకం కావాలి. ఎందుకంటే మనదేశంలో కూడా కెరీర్‌ అభివద్ధికి అవకాశాలు విస్తతమవుతున్నాయి. వ్యవసాయం మొదలు అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరో మాటచెప్పాలంటే వ్యవసాయం అనుబంధ రంగాల్లో పనిశక్తికి తీవ్రకొరత ఏర్పడింది. ఇక్కడి మానవ వనరులు ఇక్కడే వినియోగంలోకి రావాలంటే విధాన సంస్కరణ మాత్రమే కాదు, సాంస్కతిక మార్పు కూడా అవసరం. ఇంజనీరింగ్‌ పూర్తి అయ్యింది, పిల్లలు స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాథ్స్‌) ప్రొఫెషనల్స్‌గా అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియాలలో సెటిల్‌ అయ్యారనే ప్రచారాన్ని, డాంబికాన్ని పేరెంట్స్‌ దూరం పెట్టాలి. మేధస్సుతో ఇక్కడే శ్రమిస్తూ మాతభూమికే సేవచేయాలనే దఢ సంకల్పం యువతలో నెలకొనాలి. స్కిల్‌ మైగ్రేషన్‌ ఆగాలి. ప్రవాసం వద్దు. ఇండియానే ముద్దు అనే భావన, దేశభక్తి అలవడాలి. మన పారిశ్రామిక ఎగుమతులకూ సేవలకూ విలువను పెంచుతూ ఇతోధి జీవన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలి. దేశీయ పనిసంస్కతి, ఉత్పాదకత, సేవల రంగాల్ని నిలబెట్టాలి. ఇండియా బ్రాండ్‌ ఇమేజ్‌ దశ దిశలా వినపడాలి.

ఇప్పుడు మౌలిక సదుపాయాలు, మూలధనంపై మాత్రమే కాకుండా, మేధాశక్తిని ఎట్లా ఉపయోగంలో పెట్టాలి? ఆకర్షణీయంగా కావాల్సిన చోట్లకు ఎట్లా ఏ పద్ధతుల్లో అందించాలనే దానిపై దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ దష్ట్యా ఇప్పటిదాకా హ్యుమన్‌ క్యాపిటల్‌ గొప్పతనం గురించే మాట్లాడుతూ వచ్చిన మనం పొరుగుదేశం చైనా మార్చుకున్నట్టు’ టాలెంట్‌ ఈజ్‌ ఫస్ట్‌ సోర్స్‌, వురు షుడ్‌ యుటిలైజ్‌ అవర్‌ స్కిల్స్‌ ఫర్‌ ది మదర్‌ లాండ్‌’ అనే నినాదాన్ని మనమూ తలకెత్తుకోవాలి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పదేపదే ప్రతిభను ‘స్వతంత్ర ఆవిష్కరణ’ కోసం తాము చేస్తున్న ప్రయత్నంలో ‘మొదటి వనరు’గా అభివర్ణిస్తాడు.

స్కిల్‌ మైగ్రేషన్‌కు అడ్డుకట్టవేస్తూ తమ స్టెమ్‌ ప్రొఫెషనల్స్‌ ఘనత పెంచడానికి త్రిముఖ వ్యూహాన్ని రూపొందించి అమలు పరచపూనుకున్నాడు. దేశీయ విద్యను మెరుగుపరచడం, విదేశీ చైనా ప్రతిభను స్వదేశానికి రప్పించడం, విదేశీ ప్రతిభను ఆకర్షించడం. విధానపరమైన ఈ మూడు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటీ చైనా సాంకేతికాభివద్ధికి ఆర్థిక పుష్ఠికి మరింత దోహదపడనున్నాయి. అమెరికా వీసా కఠినతరంగా మారిన నేపథ్యంలో విదేశీయుల కోసం చైనా ఉపాధి ద్వారాలను బార్లా తెరిచింది. ఈ అక్టోబర్‌ 1 నుండి అమలులోకి వచ్చిన ఖ-వీసా, స్పాన్సర్‌ అవసరం లేని షరతు రహిత ఐదు సంవత్సరాల బసను కల్పిస్తూ విదేశీ మేధోయువతకు ఉదారంగా మద్దతునిస్తుంది. ఈ నేపథ్యంలో చైనా వలెనే ఇండియాకు కూడా ఉద్దేశపూర్వకంగా, బాగా నిధులు సమకూర్చే ప్రతిభా విధానం అవసరమవుతున్నది. అంటే భారత విదేశీ ప్రతిభను తిరిగి రప్పించడానికి సులభతరంగా పరిశోధన గ్రాంట్లు, వ్యవస్థాపకులకు స్టార్టప్‌ క్యాపిటల్‌, ఆవిష్కరణలకు సంస్థాగత మద్దతు, ప్రపంచ నిపుణులకు దీర్ఘకాలిక వీసాలు కల్పించాలి. ప్రాథమిక అంశాలైన- స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన వీధులు, నమ్మకమైన మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన జీవన వాతావరణాన్ని కల్పించి శాంతి భద్రతలను అందించగలిగితే, ఎకోసిస్టంలో సంపన్న దేశాల సరసన మనం చేరగలిగితే ప్రతిభలో ప్రపంచంతో పోటీ పడాలనుకునే మేధోశ్రామికులు ఎక్కడనుండైనా మనదేశానికి రాగలుగుతారు.
ఇప్పటికే దేశంలో రెండువేలకు పైబడి గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్లు ప్రారంభమైనాయి. వీటిల్లో టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, కన్సల్టింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ మొదలైన రంగాలలో ఇరవై లక్షల మంది ఇష్టంతో పనిచేస్తున్నారు. కానీ నాస్కామ్‌ ఎత్తి చూపినట్లుగా, గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ సవాళ్లతో కూడుకున్నది. అధిక అట్రిషన్‌ రేట్లు, సాంస్కతిక అమరిక, స్కేలబిలిటీ, నియంత్రణ, సమ్మతి, మౌలిక సదుపాయాలు ఇత్యాది విషయాల్లోగల వ్యత్యాసాలను అభ్యంతరాలను పరిష్కరించడానికి కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఉమ్మడి కార్యాచరణకు పూనుకోవాలి. వీటన్నింటితోపాటు ముఖ్యంగా దేశీయ విద్య (డొమెస్టిక్‌ ఎడ్యుకేషన్‌)ను పునస్థాపించాలి. స్థానిక అవసరాలను తీర్చే వత్తినైపుణ్యాలను పెంపొందించి గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్లకు అనుసంధానించాలి. చీజుూ-2020లో పేర్కొన్న విధంగా దేశీయ విద్యను అంతర్జాతీయీకరిస్తూ గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్ల సంఖ్య హెచ్చింపునకు కావలసిన ప్రోత్సహకాలు అందించాలి. ‘ఊళ్లెనే పిల్లదొరికితే సంబంధానికి ఏలూరెందుకు పోతాం’ అనే సామెత ఉందికదా! మనకు.ఉపాధి ఇక్కడే లభిస్తే దేశాలెందుకు పడతాం? అంటున్న యువశక్తిని ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలు ప్రణాళికల రూపకర్తలు సమాధాన పరచాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -