Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచర్చలు నేటికి వాయిదా

చర్చలు నేటికి వాయిదా

- Advertisement -

ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు సుదీర్ఘ చర్చలు
సమ్మె యథాతధం-ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా పలు డిమాండ్లతో సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలతో ఆదివారం రాత్రి 8.30 గంటలకు అత్యవసరంగా చర్చలు జరిపారు. అర్థరాత్రి 12.30 గంటల వరకు జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తిరిగి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు కొనసాగుతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అప్పటివరకు సమ్మెను విరమించమని కళాశాలల యజమానులను కోరామని చెప్పారు. చర్చలు పూర్తి సానుకూలంగా జరిగాయనీ, ప్రయివేటు కళాశాలల యాజామాన్యాలు ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకున్నారని అన్నారు. చర్చల్లో ఎలాంటి పరిష్కారం రానందున సోమవారం జరిగే కళాశాలల బంద్‌ యథావిధిగా ఉంటుందని ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు తెలిపాయి. సోమవారం తుది చర్చల తర్వాత తమ నిర్ణయాన్ని మళ్లీ వెల్లడిస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -