Wednesday, November 26, 2025
E-PAPER
Homeబీజినెస్ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఎకోసిస్టమ్-AgeWell‌ ప్రారంభించిన తనూరా శ్వేతా మీనన్, సునీల్ శెట్టి

ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఎకోసిస్టమ్-AgeWell‌ ప్రారంభించిన తనూరా శ్వేతా మీనన్, సునీల్ శెట్టి

- Advertisement -

నవతెలంగాణ – ముంబయి: సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ తనురా శ్వేతా మీనన్ మరియు వెల్నెస్ ఐకాన్ మరియు ఫిట్‌నెస్ ఛాంపియన్ సునీల్ శెట్టి కలసి AgeWell ప్రారంభించారు. 40 ఏళ్లు పైబడిన వయోజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ భారతదేశపు మొట్టమొదటి సంపూర్ణ వెల్‌నెస్ ఎకోసిస్టమ్‌లో యాంటీ-ఏజింగ్ ఉత్పత్తులు, హెల్తీ ఏజింగ్ పరిష్కారాలు మరియు దీర్ఘాయుష్షు-దృష్టితో రూపొందించిన కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ల సమ్మేళనం అందుబాటులో ఉంటుంది. AgeWell‌ని ఒక ప్రోడక్ట్ లాంచ్‌గా మాత్రమే కాకుండా, భారతదేశపు వయోజనుల సంరక్షణలో ప్రత్యేక అవసరాలు, తప్పిపోయిన అవకాశాలు మరియు అంతరాలను శ్రద్ధగా గుర్తించి, వాటి పరిష్కారం కోసం ప్రతి కుటుంబానికి ఒక సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించిన సహ వ్యవస్థాపకులు – తనూరా శ్వేతా మీనన్, మిత్లాజ్ మరియు షాహిన్ ఫర్జీన్ – జీవిత అనుభవాల పునాదితో ఒక జాతీయ ఆరోగ్య ఉద్యమంగా ప్రారంభించారు.

దార్శనికత

సైన్స్ ఆధారిత న్యూట్రాస్యుటికల్స్, డిజిటల్ వెల్‌నెస్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌లు, నివారణ ఆరోగ్య పరిష్కారాలు మరియు ప్రయోజన-నిర్మిత వయోజన నివాస ప్రాంతాలను సమ్మిళితం చేసిన ఒక సమగ్ర విధానం ద్వారా, వయసు మీద పడడాన్ని ఒక అస్తమయంగా కాకుండా ఒక వేడుకగా మార్చడమే AgeWell లక్ష్యం.

వ్యవస్థాపకులు

తనూరా శ్వేతా మీనన్ ఒక ప్రశంసనీయ భారతదేశపు వ్యాపార లీడర్‌గానే కాకుండా, సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా సుపరిచితురాలు. Herbs & Hugs (ఆయుర్వేద వ్యక్తిగత సంరక్షణలో ప్రత్యేకతతో భారతదేశం వ్యాప్తంగా ఉన్న 100+ కియోస్క్‌లతో పాటు 11 SKUలు మరియు పురుషుల కోసం ఆయుర్వేద వ్యక్తిగత సంరక్షణలో ప్రత్యేకత కలిగిన 10 SKUలు కలిగిన సబ్-బ్రాండ్ Bhishma) మరియు Zoul & Zera (భారతదేశం, దుబాయ్, ఒమన్, మాల్దీవులు మరియు మారిషస్‌లో అంతర్జాతీయ రీటైల్ ఉనికితో 0-6 సంవత్సరాల వయస్సు పిల్లల కోసం ఫ్యాషన్ బ్రాండ్) లాంటి విజయవంతమైన బ్రాండ్లను ఆమె నిర్మించారు. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుండి MBA డిగ్రీతో పాటు దాదాపు 36 దేశాల్లో ట్రాన్‌స్ఫర్మేటివ్ సోలో ట్రావెల్ అనుభవంతో, భారతీయుల్లో ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం అంతర్జాతీయ వెల్నెస్ అంతర్దృష్టులను ఆమె తీసుకొచ్చారు. ఆమె జ్ఞాపకాలకు అక్షర రూపమైన “తట్టమిట్ట మేనోతి”లో తన వ్యాపార నిర్మాణం మరియు వ్యక్తిగత పరివర్తనం గురించిన ప్రయాణాన్ని ఆమె వివరించారు.

“నలభైల వయసు నన్ను ఒక సంక్షోభంలా కాకుండా—ఒక అద్దంలా నన్ను నాకు పరిచయం చేసింది. నేను విస్మరించిన అలసటను, నేను పట్టించుకోని హార్మోన్ల మార్పులను మరియు నేను ఎప్పుడూ లక్ష్యపెట్టని నా వెల్నెస్ లోపాలను అది నాకు గుర్తు చేసింది. నేను నా స్వీయ ఆరోగ్యం గురించి పరిశోధించిన సమయంలో, లక్షలాది మంది భారతీయులు సైతం వారి వయసు మీద పడుతున్న ప్రయాణంలో అదేవిధమైన నిశ్శబ్దం ఎదుర్కొంటున్నట్లు నేను గుర్తించాను. ఆ సమస్యకి నా పరిష్కారం – AgeWell: చక్కగా జీవించడం కోసం దృఢత్వాన్ని వేడుక చేసే, మార్పు కోసం మద్దతు ఇచ్చే మరియు నిరోధం, సమాజం మరియు స్పష్టతను ఉపకరణాలుగా అందించే ఒక ఉద్యమం” అని AgeWell వ్యవస్థాపకురాలు తనూరా శ్వేతా మీనన్ అన్నారు.

బ్రాండ్ అంబాసిడర్

బాలీవుడ్ వెల్నెస్ అగ్రగామి, ఫిట్‌నెస్ ఐకాన్ మరియు బహుళ వెల్నెస్ స్టార్టప్‌లలో గురువుగా ఉన్న సునీల్ శెట్టి తన నాలుగు దశాబ్దాల నైపుణ్యంతో సంపూర్ణ ఆరోగ్యం మరియు మలిదశ వైపు క్రియాశీల ప్రయాణానికి అండగా నిలుస్తున్నారు. సినీ నటుడిగా మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన సుప్రసిద్ధ కెరీర్‌ను అధిగమించి, జీవితంలో క్రమశిక్షణ, స్థిరత్వం మరియు ప్రయోజనం అనేవి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి నిర్వచనాలు అనేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు.

AgeWell బ్రాండ్ అంబాసిడర్ మరియు మెంటర్‌గా సునీల్ శెట్టి మాట్లాడుతూ, “మంచి ఉద్దేశ్యం, దృఢత్వం మరియు ఆనందంతో చక్కగా జీవించడమే ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం వైపు ప్రయాణం అని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. AgeWell ద్వారా, భారతదేశంలో నలభై ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఇదే వెల్నెస్ ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ భాగస్వామ్యం గురించి నన్ను ఎక్కువగా ఉత్తేజితపరచే విషయం ఏమిటంటే, మేము కేవలం ఉత్పత్తులు అందించడం లేదు—మన గొప్ప ఆయుర్వేద వారసత్వాన్ని ఆధునిక విజ్ఞానంతో మిళితం చేసి, నిజ జీవితానికి సరిపోయే దినచర్యలను సృష్టించడం ద్వారా, ఆరోగ్యం మరియు వెల్నెస్ ఉద్యమాన్ని మేము నిర్మిస్తున్నాము.

AgeWell వ్యవస్థాపకులు నన్ను నిజంగా ఆకట్టుకున్నారు. తనూరా మరియు 20 ఏళ్ల ఆమె కుమారుడు షాహిన్‌ను నేను కలిసినప్పుడు దీని ప్రత్యేకత నాకు అర్థమైంది. ఎందుకంటే, 40ల్లో తన తల్లి ప్రయాణం చూసిన షాహిన్, తన తల్లితో పాటు ఆమె లాంటి లక్షలాది మందికి ఒక అర్థవంతమైన వ్యవస్థ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి బంధం, తరాల మధ్య అవగాహన అనేవి, భారతదేశానికి అత్యంత అవసరం.

నా జీవితంలో ఆరోగ్యం అనేది ఒక స్థిరమైన అంశంగా ఉంటోంది మరియు ఈ దశలో, వయసు మీదపడడంలోని అసలైన మాయాజాలం అనేది సంబంధితంగా, ఆవశ్యకంగా మరియు అనుసంధానంగా ఉండడంలోనే ఉందని ప్రజలకు ప్రదర్శించడం ద్వారా నేను వారిని ఆకర్షించగలను. సాకులు లేని క్రమశిక్షణ, వినూత్నతను చేరుకునే సంప్రదాయం మరియు మన 40లు, 50లు, 60లు మాత్రమే కాకుండా అటుపైన వయస్సుని సైతం క్షీణిస్తున్న జీవితంగా కాకుండా, దృఢత్వంతో నిండిన అధ్యాయాలుగా వేడుక చేసుకోవాలనే నా విశ్వాసానికి AgeWell ప్రాతినిధ్యం వహిస్తుంది. వయస్సు అనేది తమ పరిమితులను నిర్వచించడానికి ససేమిరా అనే ప్రతి భారతీయుడి కోసం విశ్వాసం, బంధాలు చెరగని ఒక ఛాంపియన్‌గా నిలుస్తున్నందుకు నేను గర్విస్తున్నాను” అన్నారు.

ఎకోసిస్టమ్

వెల్నెస్ ఉత్పత్తులు: అందం, తేజం, హార్మోన్ల సమతౌల్యత, జీవనశైలి ఆరోగ్యం మరియు బ్లడ్ షుగర్ కోసం మద్దతు అందించే 25 ఆయుర్వేద-సైన్స్ హైబ్రిడ్ న్యూట్రాస్యూటికల్స్, యాంటీ-ఏజింగ్ సప్లిమెంట్లు మరియు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం ఉత్పత్తులు. హీరో ఉత్పత్తుల్లో ఇవి కూడా ఉంటాయి:

AgeWell DAWN—భారతదేశపు మొట్టమొదటి రక్తశాలి రెడ్ రైస్ ఫ్లేక్స్ రెడీ-టూ-ఈట్ బ్రేక్ ఫాస్ట్ సెరల్

Harmoni—సహజంగా బరువు నిర్వహణ మరియు స్లిమ్ కావడానికి క్యాప్సూల్

Aura, Tandem, Eterna, Torq మరియు Sugarcalm —లక్షిత వెల్నెస్ మరియు సుదీర్ఘత కోసం పరిష్కారాలు

AgeWell Connect: ఉత్పత్తులు మాత్రమే కాకుండా, 40 ఏళ్లు పైబడిన వయోజనులు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి డ్యూయల్-ప్లాట్‌ఫామ్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను కూడా AgeWell ఆవిష్కరించింది: AgeWell కనెక్ట్ అనేది ఒక వ్యక్తిగత, సహజసిద్ధమైన సామాజిక ప్రదేశం సృష్టిస్తుంది. సభ్యులు ఇక్కడ కమ్యూనిటీ గ్రూపులు, టెలిహెల్త్ సంప్రదింపులు, నిపుణుల సెషన్లు, సాంస్కృతిక కంటెంట్ మరియు ప్రత్యేకమైన రివార్డుల కోసం యాక్సెస్ చేయవచ్చు – ఇవన్నీ 40+ స్నేహపూర్వక నావిగేషన్ మరియు ఇంటిగ్రేటెడ్ IoT డివైజ్ కనెక్టివిటీతో రూపొందించబడ్డాయి – అదేసమయంలో, AgeWell Health Tracker అనేది సమగ్ర ఆరోగ్య పర్యవేక్షణ, హృదయ స్పందన రేటు, పల్స్, ఆక్సిజన్ సంతృప్తత, నిద్ర నాణ్యత మరియు కార్యాచరణ స్థాయిలు ట్రాక్ చేయడం, తీసుకోవాల్సిన ఔషధాలు గురించిన రిమైండర్లు, హైడ్రేషన్ హెచ్చరికలు మరియు GPS లొకేషన్ షేరింగ్‌ సౌకర్యాలతో వన్-టచ్ అత్యవసర సహాయం అందిస్తుంది. సంపూర్ణ వెల్నెస్ అంతర్దృష్టుల కోసం సజావుగా ఇంటిగ్రేటెడ్ చేయబడి, నిరంతర పర్యవేక్షణ సామర్థ్యాలతో ఒక ప్రయోజన-నిర్మితంగా, ధరించగలిగిన సౌకర్యంతో త్వరలో అందుబాటులోకి రానున్న ఈ డ్యూయల్ ప్లాట్‌ఫామ్‌ అనేది వ్యక్తిగత వెల్నెస్ ప్రయాణాలను రియల్-టైమ్ హెల్త్ ఇంటెలిజెన్స్ మద్దతుతో షేర్ చేసే, వేడుక చేసుకునే అనుభవాలుగా మారుస్తుంది.

AgeWell Living రెసిడెన్సీలు: భారతదేశపు మొట్టమొదటి లాంగివిటీ లివింగ్ కమ్యూనిటీలు మరియు సీనియర్ లివింగ్ రెసిడెన్సులు—24×7 క్లినికల్ యాక్సెస్, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లు, సంపూర్ణ ఆరోగ్య సేవలు మరియు సామాజిక పర్యావరణ వ్యవస్థలతో స్వతంత్ర సీనియర్ లివింగ్‌ను అందించే రిసార్ట్-గ్రేడ్ వెల్‌నెస్ స్పేస్‌లు ఇవి.

మార్కెట్ అవకాశం

భారతదేశంలోని 40 ఏళ్లు పైబడిన జనాభా మరియు వృద్ధుల కోసం వెల్నెస్ మార్కెట్ అనేది అంతరాలతో కూడిన ఆరోగ్య సమర్పణలు, వినియోగదారుల్లో తక్కువ నమ్మకం మరియు జీవనశైలి ఆధారిత నివారణ ఆరోగ్య విధానాల్లో అంతరాలతో నిండి ఉంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం మరియు దీర్ఘాయువుకు మద్దతు ఇచ్చేందుకు సమగ్ర, విశ్వసనీయ వెల్నెస్ ఫ్రేమ్‌వర్క్‌తో రూపొందించిన AgeWell ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది.

ఆవిష్కరణ వ్యూహం

కొచ్చి, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ మరియు మాల్దీవుల్లో ప్రతిష్టాత్మక వెల్నెస్ ఎక్స్‌పీరియన్స్ స్టూడియోలు ద్వారా, 30 ప్రీమియం పార్టనర్ టచ్‌పాయింట్లు మరియు  Amazon, Flipkart మరియు Qcom‌లో డిజిటల్ ఇ-కామర్స్ ఉనికితో AgeWell అందుబాటులోకి రానుంది. మొదటి సంవత్సరం లక్ష్యాల్లో దేశవ్యాప్తంగా 10-12 ఫ్లాగ్‌షిప్ స్టూడియోలు మరియు 100+ పార్టనర్ లొకేషన్ల ఏర్పాటు ఉన్నాయి.

కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని అథానిలో AgeWell కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని పార్లమెంటు సభ్యుడు హిబి ఈడెన్ ప్రారంభించారు.

సహ-వ్యవస్థాపకుల దృక్పథం

“మేము ఒక వెల్నెస్ బ్రాండ్‌ని మాత్రమే ప్రారంభించడం లేదు. నిజానికి, భారతదేశంలోని నలభై ఏళ్లు పైబడిన మిలియన్ల మంది కోసం ఒక విశ్వసనీయ కొత్త శకం ప్రారంభిస్తున్నాము” అని AgeWell సహ-వ్యవస్థాపకులు మిత్లాజ్ అన్నారు.

“మా అమ్మ తన 40ల్లో ఏవిధంగా జీవిస్తోందో చూసినప్పుడు, మన తల్లితండ్రులను మనం పూర్తిగా విస్మరిస్తున్నామని నేను గ్రహించాను. “అందుకే, వాళ్ల కోసం ఒక విభిన్నమైన వ్యవస్థ నిర్మించాలనే నా నిబద్ధత నుండి AgeWell వచ్చింది—ఇక్కడ వృద్ధాప్యం అనేది దాని నిజమైన అనుకూలతో వ్యవహరించబడుతుంది” అని సహ-వ్యవస్థాపకులు షాహిన్ ఫర్జీన్ అన్నారు.

వర్తింపు

ఇందులోని ఆరోగ్య ఉత్పత్తులన్నీ స్థిరమైన సోర్సింగ్, రీసైకిల్ చేయగలిగిన ప్యాకేజింగ్ మరియు పారదర్శక లేబులింగ్ ప్రమాణాలకు అనుగుణంగా FSSAI మరియు AYUSH నిబంధనలు పాటిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -