Monday, March 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంటార్గెట్‌ అమెరికా!

టార్గెట్‌ అమెరికా!

- Advertisement -

– యూఎస్‌ను లక్ష్యంగా చేసుకునే క్షిపణికి ఇంజిన్‌ పరీక్ష
– కిమ్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఉత్తర కొరియా
సియోల్‌ :
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ నార్త్‌ కొరియా కీలక పరీక్షలు జరుపుతోంది. అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం ఉన్న క్షిపణికి ఇంజిన్‌ టెస్ట్‌ను జరిపింది. ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పర్యవేక్షణలో అధిక శక్తి కలిగిన సాలిడ్‌-ఫ్యూయల్‌ ఇంజిన్‌ పరీక్ష జరిగింది. ఇది నార్త్‌ కొరియా వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) తెలిపింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోగల క్షిపణుల ఆయుధాగారాన్ని విస్తరించడం, ఆధునీకరించడంపై కిమ్‌ దృఢసంకల్పంతో ఉన్నారని ఈ పరీక్ష సూచిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ వార్తా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం… ఈ పరీక్ష దేశం ఐదేండ్ల సైనిక విస్తరణ ప్రణాళికలో భాగంగా జరిగింది. ఈ ప్రణాళికలో ప్రధాన లక్ష్యం ‘వ్యూహాత్మక దాడి సామర్థ్యాలను’ అభివృద్ధి చేయడం. అంటే అణు సామర్థ్యం గల అంతర్మహాద్వీప క్షిపణులు (ఐసీబీఎంలు) తయారు చేయడం. ఈసారి పరీక్షించిన సాలిడ్‌-ఫ్యూయల్‌ ఇంజిన్‌ అత్యధిక త్రస్ట్‌ 2500 కిలో టన్నులుగా నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -