ఇజ్రాయిల్ సైన్యం వెల్లడి
జెరూసలేం : సెంట్రల్ గాజాలో ఒక వ్యక్తి కోసం ‘టార్గెటెడ్ స్ట్రైక్’ నిర్వహించినట్టు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయిల్ దళాలపై దాడికోసం సదరు వ్యక్తి ప్రణాళిక రచిస్తున్నాడని అందుకే ఈ దాడికి పాల్పడ్డామని సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం కాల్పుల విమరణ అమల్లో ఉన్నా ఇజ్రాయిల్ ఈ దాడికి తెగించడం గమనార్హం. ఇస్లామిక్ జిహాద్ సభ్యుడ్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ప్పాలడినట్టు తెలిపింది. ఈ సభ్యుడు కారులో ప్రయాణిస్తుండగా డ్రోన్ సహాయంతో ఇజ్రాయిల్ సైన్యం దాడికి దిగింది. ఒక డ్రోన్ కారును ఢకొీని దగ్ధం చేయడాన్ని చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
అలాగే, ఇజ్రాయిల్ దాడి విషయాన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది. అయితే ఇజ్రాయిల్ సైన్యం చేసిన ఆరోపణలను ఖండించింది. అలాగే ఈ దాడిలో మృతుల వివరాలను వెల్లడించలేదు. కానీ ఈ దాడిలో నలుగురు గాయపడిన విషయాన్ని పాలస్తీనా వైద్యులు చెప్పారు. కాగా, ఈ దాడితో పాటు గాజా స్ట్రిప్‌లో అతిపెద్ద నగరమైన గాజా నగరంలోని కొన్ని ప్రదేశాలపై ఇజ్రాయిల్ సైన్యం షెల్స్‌తో దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు ప్రత్యేకంగా వెల్లడించారు.



