Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeజాతీయంఆటో మొబైల్‌ పరిశ్రమల్లో టారిఫ్‌ల కల్లోలం

ఆటో మొబైల్‌ పరిశ్రమల్లో టారిఫ్‌ల కల్లోలం

- Advertisement -

– రూ.64 వేల కోట్ల వాణిజ్యంపై ట్రంప్‌ ప్రభావం
– ఎగుమతుల్లో 20 శాతం పతనం..!
– నిలిచిపోతున్న ఆర్డర్లు
– 50లక్షల మంది జీవనోపాధికి గండి
న్యూఢిల్లీ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై విధించిన సుంకాలు ఆటో పరికరాల పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అధిక టారిఫ్‌లతో ఆ పరిశ్రమలో పెట్టుబడులు పడిపోవడంతో పాటు ఉద్యోగాలు ఊడిపోనున్నా యని ఆ పరిశ్రమ నిపుణులు కలవరం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ నిర్ణయాలతో ఆటో పార్ట్స్‌ మార్కెట్‌ ఎగుమతుల్లో 15-20 శాతం పతనం చోటు చేసుకోవచ్చని.. ఇది ఆ రంగంలో నష్టాల కల్లోలాన్ని సృష్టించనుందని హెచ్చరిస్తున్నారు. భారత మొత్తం వాహన పరికరాల ఎగుమతుల్లో అమెరికా 27 శాతం వాటాను కలిగి ఉంది. అంటే దేశం మొత్తం ఉత్పత్తిలో సుమారు 8 శాతం నేరుగా ప్రభావితం కానున్నది.
ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ) గణంకాల ప్రకారం.. 2024లో అమెరికాకు దాదాపు 7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.64వేల కోట్లు) విలువ చేసే ఆటో పరికరాల ఎగుమతుల జరిగాయి. ఇందులో 3.6 బిలియన్‌ డాలర్ల విలువైన కార్లు, చిన్న ట్రక్కులకు సంబంధించిన పరికరాలు, కాంపోనెంట్లు ఉన్నాయి. మిగిలిన 3 బిలియన్‌ డాలర్లలో కమర్షియల్‌ వెహికల్‌ పార్ట్స్‌, కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కాంపోనెంట్లు, ఆఫ్‌ హైవే మెషినరీ, ట్రాక్టర్‌, ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ పరికరాలు ఉన్నాయి. వీటిపై ఈ నెల 27 నుంచి 50 శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ రంగంపై ప్రత్యక్షంగా 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారని పరిశ్రమ వర్గాల అంచనా. అధిక టారిఫ్‌లు జీవనోపాధిని దెబ్బతీయనున్నాయని ఆ వర్గాల్లో కలవరం నెలకొందని రేటింగ్‌ ఎజెన్సీ ఇక్రా గ్రూప్‌ హెడ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జితిన్‌ మక్కర్‌ తెలిపారు. పెద్ద ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్లు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తున్నారు. అయినప్పటికీ ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. అమెరికన్‌ కస్టమర్లు ఇప్పటికే టారిఫ్‌ భారాన్ని ఎగుమతిదారులే మోయా లని అడుగుతున్నారని అల్యూమినియం కాస్టింగ్‌ తయారీదారు నోబుల్‌ కాస్ట్‌ కాంప్‌ చైర్మెన్‌, ఎండీ నితిన్‌ భగవత్‌ తెలిపారు. తమ ఉత్పత్తిలో 60 శాతం ఎగుమతులు అమెరికాకు జరుగుతున్నాయ న్నారు. యూఎస్‌ అధిక టారిఫ్‌లు లాభాల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయన్నారు. జపాన్‌, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల నుంచి ఎగుమతి చేసేవారితో పోలిస్తే భారత ఎగుమతిదారులు నష్టపోతారని వెక్టర్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ పార్టనర్‌ రవీంద్ర పట్కి పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad