నవతెలంగాణ – ఆదిలాబాద్ : టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తమ పాలసీదారుల పట్ల నిబద్ధతకు నిదర్శనంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ నర్సింగ్ నాయక్ కుటుంబానికి ₹1 కోటి రూపాయల క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించింది. రాథోడ్ నర్సింగ్ నాయక్ గారు 2021 సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ₹54,000 వార్షిక ప్రీమియంతో ₹1 కోటి రూపాయల టర్మ్ పాలసీ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు, 2025 ఆగస్టు 1న ఆయన హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించారు. నామినీ, బాధిత కుటుంబ సభ్యురాలు సంధ్యారాణి చౌహాన్కు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారి అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ₹1 కోటి రూపాయల క్లెయిమ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్లు కే. వీరస్వామి, ఆదర్శ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు బి. చంద్రశేఖర్, శ్రీకాంత్, నవీన్ పాల్గొన్నారు.
ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ అవసరం
“ఈ ఘటన ప్రతి కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో స్పష్టంగా చెబుతోంది. కేవలం ₹54,000 వార్షిక ప్రీమియంతో ₹1 కోటి రూపాయల రక్షణ పొందడం ద్వారా రాథోడ్ నర్సింగ్ నాయక్ తన కుటుంబ భవిష్యత్తును సురక్షితంగా ఉంచారు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో అత్యంత విశ్వసనీయ సంస్థగా నిలిచి, లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తోంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తక్కువ ఖర్చుతో అత్యధిక కవరేజీని అందించే అత్యంత ముఖ్యమైన పాలసీ. ప్రతి కుటుంబ బాధ్యత కలిగిన వ్యక్తి తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచిస్తున్నాను” అని ఈ సందర్భంగా ఏజెన్సీ మేనేజర్ మల్లారపు పుష్ప తెలిపారు. “అదే సమయంలో, ఈ రంగంలో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. టాటా ఏఐఏ అడ్వైజర్‌గా చేరి, ప్రజలకు ఆర్థిక భద్రత అందించడమే కాకుండా, మంచి ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. నాణ్యమైన శిక్షణ, గైడెన్స్, కెరీర్ గ్రోత్ అవకాశాలను అందుపుచ్చుకొని ఎదగాలనుకునేవారు https://mallarapupushpa.tataaiapartner.com?tid=e84tf ఈ లింకు ద్వారా లైఫ్ ఏజెంట్గా అప్లై చేసుకొని స్వతంత్ర వ్యాపారవేత్తగా ఎదగవచ్చు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాలలోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పాలసీ సంబంధిత సేవలను పొందేందుకు mallarapupushpa@tataaiapartner.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు అని పేర్కొన్నారు.