జెనీవా: గతేడాది ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధి కేసులు రికార్డు స్థాయిలో పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. 2024లో 83 లక్షల మందిలో కొత్తగా టీబీ నిర్ధరణ అయ్యిందని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది అధికమని తెలిపింది. అయితే, మరణాల సంఖ్య మాత్రం తగ్గినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో క్షయ నిర్ధరణ పరీక్షలు, చికిత్సకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్క్రీనింగ్, చికిత్స మెరుగుపడుతుందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. విశ్వవ్యాప్తంగా 2023లో టీబీ మరణాల సంఖ్య 12.5లక్షలుగా ఉండగా.. గతేడాది ఈ సంఖ్య 12.3లక్షలకు తగ్గినట్టు తెలిపింది.
అమెరికాలో గతేడాది టీబీ కేసుల సంఖ్య పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. దశాబ్దం కాలంలో ఇదే అత్యధికమని పేర్కొంది. అమెరికా టీబీ కేసుల్లో ఇతర దేశాల్లో జన్మించిన వారిలోనే ఇవి ఎక్కువ ఉన్నట్లు అంచనా. ప్రపంచంలోని పావు వంతు మందిలో టీబీ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ.. కేవలం కొందరిలోనే లక్షణాలు బయటపడతాయి. సరైన సమయంలో చికిత్స అందించకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమైన వ్యాధుల్లో టీబీ ఒకటిగా ఉంటోంది. ఈ వ్యాధికి సంబంధించి ఏటా డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలు విడుదల చేస్తుంది. 184 దేశాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తాజా నివేదిక విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసులు పైపైకి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



