Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిలివేరు కాశీనాథ్ ను కలిసిన టీడీపీ నేతలు

సిలివేరు కాశీనాథ్ ను కలిసిన టీడీపీ నేతలు

- Advertisement -

నవతెలంగాణ – చండూరు 
శ్రీశైలం దేవస్థానం కి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సిలువేరు కాశీనాథ్  ని టెంపుల్ డైరెక్టర్ గా ప్రకటించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు గోస్కొండ వెంకటేష్ ఆధ్వర్యంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సిలివేరు కాశీనాథ్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక ఎలక్షన్లో జడ్పిటిసి ,ఎంపీటీసీ, సర్పంచ్ , వార్డ్ మెంబర్స్ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని వారు తెలిపారు.ఆయన హయాంలో ఎంతోమంది సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పిటిసిలు అయినారు వాళ్ళందర్నీ పేరుపేరునా  అడిగారు ఒకసారి మునుగోడు నియోజకవర్గానికి రావాలని విజ్ఞప్తి చేశారు కాశీనాథ్  స్పందించి సానుకూలంగా వస్తానని మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, టి ఎన్ ఎస్ ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు కందగట్ల మురళి, జయేందర్, రాష్ట్ర తెలుగు యువత మాజీ రాష్ట్ర నాయకులు ముద్ధం శ్రీనివాస్, మర్రిగూడ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలే మల్లయ్య, మహేశ్వరం నియోజకవర్గ ఆర్కే పురండివిజన్ అధ్యక్షులు బొడ్డు నరసింహ యాదవ్, నాంపల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంగి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -