నవతెలంగాణ – బల్మూరు
మండలంలోని శ్రీ ఉమా మహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగులలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ -1,3 ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ రవి పరంగి అధ్యక్షతన సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో విలువైనదని ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేవాడని గుర్తు చేశారు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది అని అన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఆర్.వెంకటయ్య , బి. జాన్ బాబు, అధ్యాపకులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ బాలరాజు, డాక్టర్ శివకుమార్, డాక్టర్ కృష్ణ గోపాల్, డాక్టర్ ఈశ్వర్ లాల్, గోపాల్ ,కిరణ్, ముంతాజ్ బేగం గాయత్రి శంకర్ గౌడ్ మరియు అధ్యాపకేతర సిబ్బంది నరసింహులు, శివమ్మ, లలిత రేణుక, చాంద్ బి, ఆంజనేయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES