నవతెలంగాణ – ఆర్మూర్
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని మామిడిపల్లి విజయ్ హైస్కూల్ లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ హై స్కూల్ కరస్పాండెంట్ టి. కవితాదివాకర్ విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ…1952 నుంచి 1962 వరకు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత 1962 నుంచి 1967 వరకూ రెండవ రాష్ట్రపతిగా పనిచేశారని గుర్తు చేశారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఉపాధ్యాయులు క్రొవ్వొత్తులాంటి వారని, తను కరుగుతూ విద్యార్థి జీవితాల్లో వెలుగును నింపే పవిత్రమైన వృత్తిలో కొనసాగుతు విద్యార్థులకు శ్రద్ధగా బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులకు మంచి గౌరవం ఇవ్వాలని సూచించడంతో అతని జన్మదినం (సెప్టెంబర్ 5)ను దేశవ్యాప్తంగా “ఉపాధ్యాయ దినోత్సవం”గా జరుపుకుంటారనీ ఆమె పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని అనుసరించి విద్యార్థిని విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీ. రమాదేవి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.