Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల విందు 

ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల విందు 

- Advertisement -

నవతెలంగాణ-చేర్యాల : వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ నేపథ్యంలో  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేని సమయంలో ఉపాధ్యాయులు చికెన్,బిర్యానీలతో విందు చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మ గడ్డ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కిచెన్ షెడ్ ను పరిశీలించగా బిర్యానీ,చికెన్ వండడంతో పాఠశాల ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులు లేని సమయంలో మెనూకి విరుద్ధంగా చికెన్,బిర్యానీ ఎందుకు వండారనీ,ఈ భోజనాన్ని ఎవరికి పెడతారని ఉపాధ్యాయులను నిలదీశారు. వండిన భోజనాన్ని హాస్టల్ విద్యార్థులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు చికెన్, బిర్యానీలతో పాఠశాలలోనే విందులు చేసుకోవడంతో ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చికెన్,బిర్యానీలతో విందులు చేసుకున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -