Sunday, November 16, 2025
E-PAPER
Homeజిల్లాలుసెలవుల్లో ఉపాధ్యాయులు..

సెలవుల్లో ఉపాధ్యాయులు..

- Advertisement -

ఒకే రోజు ఆరుగురు విధులకు డుమ్మా

ఆన్ డ్యూటీ లో మరోకరు

ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయుల తీరు

పాఠశాలల నిర్వహణపై సర్వత్రా విమర్శలు

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

నవతెలంగాణ పెద్దవంగర:

మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలకు చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు ఓకే రోజు విధులకు గైర్హాజరయ్యారు. వీరితో పాటు మరో ఉపాధ్యాయుడు సైతం ఆన్ డ్యూటీ లో వెళ్లారు. పాఠశాలలో మొత్తం 16 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఏడుగురు ఉపాధ్యాయులు ఒకేరోజు పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పే వారే కరువయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, (ఎంఈవో) రెండు రోజులుగా సెలవుల్లో ఉన్నారు. ఆయనతో పాటుగా ముగ్గురు ఉపాధ్యాయినిలు, మరో ఇద్దరు కూడా లీవ్ లో ఉన్నారు.

వీరిలో ఒకరు ఉదయం, మరోకరు మధ్యాహ్నం సెలవు పెట్టారు. ఇంకో ఉపాధ్యాయుడు ఆన్ డ్యూటీ లో వెళ్లాడు. విధుల నిర్వహణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మండలంలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, మరికొందరు ఉపాధ్యాయులు సెల్ ఫోన్లు ఇష్టారాజ్యంగా వాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మధ్యాహ్నం తరగతులు కూడా సరిగా జరగడం లేదని, ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, చర్యలు లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతుందని ప్రజల్లో చర్చ నడుస్తుంది. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -