నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలి గ్రామ నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సర్పంచ్ మాత్రే నాగనాథ్ ను గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జే. సంతోష్ కుమార్ , ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి సమస్యలను పరిష్కరించేందుకు తన వతుగా కృషి చేస్తానన్నారు. సమస్యలుంటే నేరుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. పాఠశాల అభివృద్ధి గురించి ఎల్లవేళలా తోడ్పాటున అందిస్తానని అన్నారు. పేదలకు అందించే ప్రభుత్వ విద్య ప్రతి ఒక్కరికి అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయురాలు లక్ష్మి, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.
కంఠాలి సర్పంచ్ ను సన్మానించిన ఉపాధ్యాయులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



