- Advertisement -
- – సిపిఎస్ విధానం రద్దు చేయాలి...
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలంలోని పిఆర్టియు మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాకు మండల ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్ మాట్లాడుతూ కంట్రీబ్యూటరీ విధానం రద్దుచేసి ఉపాధ్యాయ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చి ఉపాధ్యాయుల జీవితాలలో వెలుగు నివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉందని, సీఎం రేవంత్ రెడ్డి ఈ హామీని కచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కిషోర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కృష్ణ, నాందేవ్, శంకర్, మండల నాయకులు తాహేర్, శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -