- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలోని గిద్ద ప్రాథమిక పాఠశాలలో సోమవారం వనమహోత్సవంలో భాగంగా ఉపాధ్యాయులు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మోహన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటి సంరక్షించి వృక్ష సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎల్లయ్య, సిఆర్పి మహమ్మద్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, రాజయ్య, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -