- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు: ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. విద్యార్థులకు విజ్ఞానం, విలువలు, క్రమశిక్షణ బోధిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో విశిష్టమైనదని, విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు. మంథని నియోజకవర్గం,పెద్దపల్లి,భూపాలపల్లి జిల్లాలతోపాటు రాష్ట్ర విద్యా రంగం మరింత అభివృద్ధి సాధించేందుకు ఉపాధ్యాయుల సహకారం ఎంతో అవసరమని, ఆదిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు.
- Advertisement -