నవతెలంగాణ – మాక్లూర్
రాష్ట్రంలో పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని జిల్లా యూఎస్ పిసి, టీస్ యూటీఎఫ్ ఆద్వర్యంలో కోరారు. బుదవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహశీల్దార్ పద్మలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, అధికారులకు ప్రాతినిధ్యాలు సమర్పించినప్పటికీ స్పందించకపోవడం చాలా దారుణమని వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయుల్లో అశాంతి, అసంతృప్తి తీవ్రమవుతున్నాయని, ఈ నేపథ్యంలో పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు మరోసారి ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దశలవారీ పోరాటం చేయడానికి నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో తొలి కార్యాచరణలో భాగంగా మండల తహశీల్దార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నామన్నారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ పి సి ప్రతినిధులు టిఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఎన్. రాజారామ్, జిల్లా టిఎస్ యూటీఎఫ్ కార్యదర్శి మల్క జనార్దన్, టిఎస్ యూటీఎఫ్ మండల మండల ప్రధాన కార్యదర్శి కపిల్ దేవ్ బుధవారం తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES