Thursday, July 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి..

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి..

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
విద్య, ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలలో బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్  కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ ఫ్రాంక్లిన్ ఆల్బర్ట్ కు వినతి పత్రం అందజేశారు‌. ఈ సందర్భంగా డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. వెంకులు, టీఎస్ యుటిఎఫ్ ఆడిట్ కమిటీ కన్వీనర్ యం.మురళయ్యలు మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ను తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 25 ను సవరించి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయు లుండేలా చర్యలు తీసుకోవాలని,40 మంది విద్యార్థులున్న  ప్రాథమిక పాఠశాలలలో తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలని పేర్కొన్నారు. పి.అర్.సి నివేదికను వెంటనే తెప్పించుకొని జూలై 1,2023 నుండి అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని, అశాస్త్రీయంగా ఉన్న గురుకుల పాఠశాలల టైం టేబుల్ ను  సవరించాలనే 30 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి డి.క్రిష్ణ, డిటిఎఫ్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎన్.వీరస్వామి,ఫిరోజ్,మాణిక్యం, నాగభూషణం ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -