Sunday, September 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్టెట్ పరీక్ష నుండి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి

టెట్ పరీక్ష నుండి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి

- Advertisement -

టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరాం
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్ 

2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరాం డిమాండ్ చేశారు. ఆదివారం కేంద్రంలోని తిరుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు మరియు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సంఘ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్.శ్రీకాంత్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరాం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం బాధాకరమన్నారు. కావున ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. అదేవిధంగా టెట్ సిలబస్ లో మార్పులు చేయాలని సూచించారు.

ఏ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు అదే సబ్జెక్టులో టేట్ పరీక్ష రాసే వీలు ఉండాలన్నారు. అదేవిధంగా అర్హత మార్కులు కులాలవారీగా కాకుండా అందరికీ ఒకే రకంగా ఉండాలని, 40% అర్హత మార్కులుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈహెచ్ఎస్ అమలుకు కమిటీ వేయడం సరికాదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య కార్డులు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  సిపిఎస్ ను రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.317 బాధిత ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు తీసుకురావాలని  కోరారు. మిగిలిపోయిన స్పోజ్ బదిలీలు వెంటనే చేపట్టాలన్నారు.

పిఆర్సి నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ శ్రీకాంత్ ఎం జలంధర్ రెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు బలిరామ్ జాదవ్, రాష్ట్ర కార్యదర్శులు గండ్రత్ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రపుల్ చందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు కే.అరుణ, జిల్లా బాధ్యులు, బోథ్ మండల అధ్యక్షులు అప్పల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బైరి సతీష్ వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -