- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు సమయపాలన పాటించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండలంలోని ఇసాన్నపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయుల విద్యా బోధన గురించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -