Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించాలి: ఎంపీడీవో వేదవతి 

మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించాలి: ఎంపీడీవో వేదవతి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు ప్రధాన భూమికను పోషించాలని ఎంపీడీవో వర్కల వేదవతి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి షరీఫ్, మండల అధ్యక్షుడు చిదురాల శ్రీనివాస్ తో కలిసి డిటిఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వేదవతి మాట్లాడుతూ.. విలువలు దిగజారుతున్న నేటి సమాజంలో అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది మెరుగైన సమాజాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సమయపాలన పాటించాలని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ఉపాధ్యాయులకే అసాధ్యమన్నారు. విద్యార్థినీ, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. సమాజానికే ఉపాధ్యాయులు దిక్సూచులని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ మండల కార్యదర్శి దేవగిరి సూర్య ప్రకాష్, మండల బాధ్యుల కమలాకర్, అశోక్, మెహరున్నిసా , విజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -