– లాంగ్ జంప్‌లో బ్రాంజ్
– 100 మీటర్ల పరుగులో సిల్వర్ పతకం కైవసం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో కరీంనగర్ డా.బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రతిభ కనబరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తోలెం శ్రీనివాసరావు (ఎస్‌ఏ-జీవశాస్త్రం) ఈ పోటీలలో లాంగ్ జంప్ విభాగంలో బ్రాంజ్ పతకం, 100 మీటర్ల పరుగుపందెంలో సిల్వర్ పతకం సాధించారు. ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా క్రీడాకారుడిగా కూడా తన సామర్థ్యాన్ని చాటుతూ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడకం మోతీరు మాట్లాడుతూ.. జీవశాస్త్రం అనేది పుస్తకాల్లో పరిమితమయ్యే విషయం కాదని, అది నిజజీవితంలో ఆరోగ్యం, శారీరక దృఢత్వం, జీవనశైలిని మార్చే శాస్త్రం అన్నారు. ఉపాధ్యాయులు బోధించే జ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేసి చూపినప్పుడే అది నిజమైన బోధన అవుతుందని కొనియాడారు. ఉపాధ్యాయుడే క్రీడల్లో ముందుండి విజయం సాధించడం విద్యార్థులకు గొప్ప స్ఫూర్తి అని తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
మాస్టర్ అథ్లెటిక్స్‌లో ఉపాధ్యాయుడి ప్రతిభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



