Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కులగణన సర్వే చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించాలి

కులగణన సర్వే చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించాలి

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ
నవతెలంగాణ – నెల్లికుదురు 

కుల గణన సర్వే విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ వెంటనే చెల్లించాలని టి ఎస్ యు టి ఎఫ్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ డిమాండ్ చేశారు. టిఎస్ యుటిఎఫ్ నెల్లికుదురు 12వ మండల మహాసభను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆ సంఘం మండల అధ్యక్షులు రంజిత్ కుమార్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశములో ముఖ్య అతిథిగా హాజరైన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ  మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే విధులు నిర్వహించిన సూపర్వైజర్ లకు రూ.12,000, ఎన్యూమరేటర్ లకు రూ.10,000 చొప్పున చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఏడాది దాటిన చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చెందారు. జి

ల్లా అధికారులకు ఎన్ని మార్లు విన్నవించినా ఫలితం లేదని పోరాటానికి ఉపాద్యాయులు సిద్దం కావాలని అన్నారు. విద్యాహక్కు చట్టం అమలకు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుండి మినాయింపు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఐదు డీఏ లను మంజూరు చేయాలని ఆయన కోరారు. 2023 జూలై నుండి పిఆర్సి అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులన్నిటిని క్లియర్ చేయాలని, 317 ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలని విన్నవించారు. సర్వీస్ నిబంధనలు 11,12 ప్రకారం కామన్ సీనియారిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ భాషలకు, పిజికల్ డైరెక్టర్ పదోన్నతులు ఇవ్వాలని ఈ సందర్బంగా ఆయన కోరారు.

గురుకులాలన్నింటిని కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మైనారిటీ గురుకుల టైం టేబుల్ మాదిరిగా అన్ని గురుకులాల్లో మార్చాలని, గురుకుల, కెజిబివి స్కూల్స్ లో కేర్ టేకర్ లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. గురుకులాల్లో పిజిటి హిందీ పోస్ట్ మంజూరు చేయాలని , మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కిందకు తేవాలని సూచించారు. కేజీబీవీ టీచర్లకు మినిమం బేసిక్ పే అమలు చెయ్యాలని కోరారు. ఈ సమావేశంలో మండల ప్రధానకార్యదర్శిజనర్ధన్ , నరేందర్, భాస్కర్, యుగేందర్, రవీంద్ర, రాజన్న, దుర్గయ్య, మధు, వెంకన్న, తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -