Thursday, December 4, 2025
E-PAPER
Homeఆటలురెండో వన్డేలో టీమిండియాకు నిరాశ

రెండో వన్డేలో టీమిండియాకు నిరాశ

- Advertisement -

– భారీ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా
– కోహ్లి, గైక్వాడ్‌ సెంచరీలు వృధా
– మార్‌క్రమ్‌ శతకం, బ్రెవీస్‌, బ్రీజ్కే మెరుపులు
రారుపూర్‌ :
రెండో వన్డేలో టీమిండియా నిర్దేశించిన 359పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు సునాయాసంగా చేధించింది. 49.2 ఓవర్లలో కేవలం 6వికెట్లు కోల్పోయి 359పరుగులు చేసి దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయం సాధించింది. మార్‌క్రమ్‌ శతకానికి తోడు బ్రెవీస్‌, బ్రీజ్కే అర్ధసెంచరీలతో రాణించి దక్షిణాఫ్రికా గెలుపులో కీలకపాత్ర పోషించారు. తొలుత క్వింటన్‌ డికాక్‌(8) నిరాశపరిచినా.. కెప్టెన్‌ బవుమా(46)తో కలిసి మార్‌క్రమ్‌(110) సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత బ్రెవీస్‌(54), బ్రీజ్కే(68) క్రీజ్‌లో నిలిచి సఫారీ జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివర్లో బెచ్‌(26నాటౌట్‌; 15బంతుల్లో 3ఫోర్లు) మహరాజ్‌(10నాటౌట్‌) దక్షిణాఫ్రికాను మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. భారత బౌలర్లు ఆర్ష్‌దీప్‌, ప్రసిధ్‌ కృష్ణకు రెండేసి, హర్షిత్‌, కుల్దీప్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 358పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. రోహిత్‌ శర్మ(14), జైస్వాల్‌ కలిసి తొలి వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రోహిత్‌ ఔటైనా.. మరో ఓపెనర్‌ జైస్వాల్‌(22) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసాడు. వీరిద్దరి తర్వాత తొలి వన్డే హీరో విరాట్‌ కోహ్లీ(102)కి తోడు రుతురాజ్‌ గైక్వాడ్‌(105) జోడీ స్కోర్‌ను పరుగులెత్తించారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. మరో వికెట్‌ పడగకుండా జాగ్రత్త పడుతూ పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే రుతురాజ్‌ కేవలం 77 బంతుల్లోనే కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. 82 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 105 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో విరాట్‌ సైతం అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. రాంచీ వన్డేలో సెంచరీతో కదం తొక్కిన విరాట్‌.. అదే ఫామ్‌తో రారుపూర్‌ వన్డేలో చెలరేగాడు. ఈ క్రమంలో వన్డేలో కింగ్‌ కోహ్లీ 93 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 102 పరుగులు చేశాడు. ఈ వన్డేలోనూ సెంచరీ చేసి వన్డేల్లో తన సెంచరీల సంఖ్యను 53కు పెంచుకున్నాడు. రుతురాజ్‌-విరాట్‌ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 156 బంతుల్లో 195 పరుగులు చేశారు. చివర్లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(24) సహకారం అందించాడు. దాంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్‌ చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో యాన్సెన్‌కు రెండు, బర్గర్‌, ఎన్గిడికి చెరో వికెట్‌ దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలువగా.. మూడో, చివరి వన్డే విశాఖపట్నం వేదికగా శనివారం జరగనుంది.

స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)బోచ్‌ (బి)యాన్సెన్‌ 22, రోహిత్‌ (సి)డికాక్‌ (బి)బర్గర్‌ 14, కోహ్లి (సి)మార్‌క్రమ్‌ (బి)ఎన్గిడి 102, గైక్వాడ్‌ (సి)జోర్జి (బి)యాన్సెన్‌ 105, కెఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 66, సుందర్‌ (రనౌట్‌)బోచ్‌/డికాక్‌ 1, జడేజా (నాటౌట్‌) 24, అదనం 24. (50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 358పరుగులు.
వికెట్ల పతనం: 1/40, 2/62, 3/257, 4/284, 5/289

బౌలింగ్‌: జైస్వాల్‌ 6.1-0-43-1, ఎన్గిడి 10-1-51-1, యాన్సెన్‌ 10-0-63-2, మహరాజ్‌ 10-0-70-0, బోచ్‌ 8-0-79-0, మార్‌క్రమ్‌ 5.5-0-48-0
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి)గైక్వాడ్‌ (బి)హర్షిత్‌ రాణా 110, డికాక్‌ (సి)సుందర్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 8, బవుమా (సి)హర్షిత్‌ రాణా (బి)ప్రసిద్‌ కృష్ణ 46, బ్రిజ్కే (ఎల్‌బి)ప్రసిధ్‌ 68, బ్రెవీస్‌ (సి)జైస్వాల్‌ (బి)కుల్దీప్‌ 54, జోర్జి (రిటైర్డ్‌ హార్ట్‌) 17, యాన్సెన్‌ (సి)గైక్వాడ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 2, బోచ్‌ (నాటౌట్‌) 26, కేశవ్‌ మహరాజ్‌ (నాటౌట్‌) 10, అదనం 18. (49.2ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 359పరుగులు.

వికెట్ల పతనం: 1/26, 2/127, 3/197, 4/289, 5/317, 6/322
బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 10-0-54-2, హర్షిత్‌ రాణా 10-0-70-1, ప్రసిధ్‌ కృష్ణ 8.2-0-82-2, సుందర్‌ 4-028-0, జడేజా 7-10-41-0, కుల్దీప్‌ 10-0-78-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -