Saturday, October 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవరంగల్‌ నీట్‌లో టెక్నోజియన్‌-2025 ప్రారంభం

వరంగల్‌ నీట్‌లో టెక్నోజియన్‌-2025 ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కాజీపేట
వరంగల్‌లోని జాతీయ సాంకేతిక సంస్థ(నీట్‌)లో వార్షిక సాంకేతిక మహోత్సవం ‘టెక్నోజియన్‌-2025’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో అధికారిక టెక్నోజియాన్‌-2025 వీడియోను ప్రదర్శించారు. దీనిలో గత ఎడిషన్‌ల ముఖ్య ఘట్టాలు, ఈ ఏడాది ప్రధాన కార్యక్రమాల అవలోకనాన్ని వివరించారు. ఈ వేడుకకు ఎన్‌ఐటీ వరంగల్‌ పూర్వ విద్యార్థిని, బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ ప్రొఫెసర్‌ జి. మాధవిలత, సాంకేతిక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ యు. వెంకన్న మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఎత్తయిన చెనాబ్‌ రైల్వే వంతెన గురించి వివరించారు. దృఢత్వం, సృజనాత్మకత, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో సమన్వయ ప్రాముఖ్యతను తెలిపారు. రూపకల్పన కచ్చితత్వం, స్థలస్థాయి నిర్ణయాలు, బృంద సమన్వయం ఈ మూడు అంశాల కలయికతోనే ఈ మహా ప్రాజెక్ట్‌ విజయవంతమైందని చెప్పారు. అలాగే, టెక్నోజియన్‌ ఉద్దేశ్యాన్ని వివరించారు. స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌ డాక్టర్‌ కె. కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకుల కృషిని ప్రశంసించారు. 2001లో ప్రారంభమైన టెక్నోజియన్‌ ప్రస్తుతం దేశంలోని అగ్రగామి విద్యార్థి ఆధారిత సాంకేతిక ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగిందని అన్నారు. ఈ ఏడాది దాదాపు 7000మంది విద్యార్థులు వివిధ విద్యాసంస్థల నుంచి పాల్గొన్నారని తెలి పారు. ఫ్యాకల్టీ వెల్ఫేర్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పి.రాధాకృష్ణ, టెక్నోజియన్‌ బృందం చూపిన నిబద్ధత, ప్రొఫెషనలిజాన్ని అభినందించారు. ఎన్‌ఐటీ వరంగల్‌ డైరెక్టర్‌.. వర్చువల్‌గా పాల్గొని విద్యార్థులు, అధ్యాపకులను అభినం దించారు. టెక్నోజియన్‌ ద్వారా సృజనాత్మకత, నాయకత్వం, నిజజీవిత ఇంజనీరింగ్‌ ప్రతిభను ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -