Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల సాధికారతకు సాంకేతిక పరిజ్ఞానం

వికలాంగుల సాధికారతకు సాంకేతిక పరిజ్ఞానం

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికలాంగుల సాధికారతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్టు రాష్ట్ర వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఎలియెన్‌ ఇన్నోవేషన్స్‌ కార్యాలయంలో నిర్వహించిన అసిస్టివ్‌ టెక్నాలజీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు స్టార్టప్‌ కంపెనీలతో కలిసి కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో, నూతన ఆవిష్కర్తల్లో వారి సంఖ్య పెరిగేలా వారిని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.

వికలాంగులకు అవసరమైన ఉత్పత్తులను రూపొందిస్తున్న ఎలియెన్‌ ఇన్నోవేషన్స్‌ సంస్థ వ్యవస్థాపకులు రవి కిరణ్‌ గ్లోబల్‌ ఇమాజిన్‌ వెంచర్‌ విన్నర్‌ అవార్డు అందుకున్నారని ఆయన అభినందించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వికలాంగులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కార్పొరేట్‌ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. వికలాంగుల సాధికారత విషయంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ సీఈఓ మిరాజ్‌, యునిసెఫ్‌ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) ఫీల్డ్‌ ఆఫీసర్‌ జెలామియాలి, ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి ప్రదీప్‌తో పాటు నెట్‌వర్క్‌ మోడల్‌పై పనిచేస్తున్న పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -