నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో ఐదవ రోజు తీజ్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ బీజేపీ స్టేట్ గిరిజన మోర్చా అధ్యక్షులు డాక్టర్ బిలోజి నాయక్ పాల్గొని మాట్లాడుతూ బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. గిరిజన శక్తి అధ్యక్షుడు శీను రాథోడ్ మాట్లాడుతూ వివిధ తండాల్లో జగదంబ మాత సేవాలాల్ మహారాజ్ ఆలయాలో గోధుమ బుట్టలు తొమ్మిది రోజులపాటు యువతులు పూజలు చేస్తారని తమకు మంచి భర్త రావాలని కోరుతరని వివరించారు.స్వామి నాయక్ మాట్లాడుతూ సమాజంలో అందరికీ మంచి జరగాలని అదేవిధంగా తాండాలలో పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా యువ కవి రైటర్ రాజు, ప్రకాష్ నాయక్, సోను పవర్, యూనివర్సిటీ ఎన్ ఎస్ యూ ఐ యూనివర్సిటీ అధ్యక్షులు సాగర్ నాయక్, రాము, రాజు ,సంతోష్, మోహన్, సచిన్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.
యూనివర్సిటీలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES