- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గంగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మాక్లుర్ తండా వద్ద ఉన్న ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్లో బంజారాలు ముఖ్యంగా జరుపుకునే తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవంను పాఠశాల ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ పర్యవేక్షణలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీలు పాల్గొని ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమం లో విద్యార్థినులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -